News October 16, 2024

నిజామాబాద్: SRSP పరీవాహక ప్రజలకు హెచ్చరిక

image

SRSP ప్రాజెక్ట్ 100 శాతం నిండిపోయి పైనుంచి అదనపు నీటిప్రవాహం ఉన్నందున బుధవారం (నేటి) ఉదయం ఎస్కేప్ గేట్లుఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేయనున్నట్లు పోచంపాడ్ డ్యాం సైట్ కార్యనిర్వాహక ఇంజినీర్ చక్రపాణి ఓ ప్రకటనలో తెలిపారు. మత్స్యకారులు, పశువుల కాపర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరూ నదిలోకి దిగొద్దని, ప్రమాదానికి గురికావద్దని ఆయన సూచించారు.

Similar News

News October 16, 2024

KMR: నవోదయ ప్రవేశ పరీక్ష కోసం ఆన్‌లైన్లో దరఖాస్తులు

image

నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయం లో 2025-26 విద్యా సంవత్సరంలో 9వ తరగతి, 11వ తరగతిలో ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. ఈనెల 30 వరకు చివరి గడువు ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News October 16, 2024

NZB: సౌండ్ బాక్స్ అద్దెకిచ్చిన ఒకరికి జైలు శిక్ష

image

సౌండ్ బాక్స్‌ల వినియోగం పై ఉన్న నిషేధాజ్ఞలు ఉల్లంఘించి లైసెన్స్ లేకుండా సౌండ్ సిస్టంలను కిరాయికి ఇచ్చిన యజమానికి న్యాయస్థానం ఒక రోజు జైలు శిక్ష విధించింది. మోపాల్ మండలం కులాస్ పూర్ గ్రామానికి చెందిన నిమ్మల వంశీ దసరా పండగ సందర్భంగా తన డిజేను అద్దెకు ఇచ్చారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు వంశీపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఒక రోజు జైలు శిక్ష విధించారు.

News October 16, 2024

NZB:త్వరలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క

image

చాలాకాలంగా పెండింగ్లో ఉన్న NZB, అదిలాబాద్ సహా అన్ని జిల్లాల్లో అన్ని శాఖల బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు రాష్ట్రమంత్రి సీతక్క తెలిపారు.బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని HYD సెక్రటేరియట్ సమావేశంలో పేర్కొన్నారు. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి అపాయింట్​ మెంట్​ లెటర్స్​ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కరుణ, తదితరులు పాల్గొన్నారు.