News October 16, 2024
నిజామాబాద్: SRSP పరీవాహక ప్రజలకు హెచ్చరిక
SRSP ప్రాజెక్ట్ 100 శాతం నిండిపోయి పైనుంచి అదనపు నీటిప్రవాహం ఉన్నందున బుధవారం (నేటి) ఉదయం ఎస్కేప్ గేట్లుఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేయనున్నట్లు పోచంపాడ్ డ్యాం సైట్ కార్యనిర్వాహక ఇంజినీర్ చక్రపాణి ఓ ప్రకటనలో తెలిపారు. మత్స్యకారులు, పశువుల కాపర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరూ నదిలోకి దిగొద్దని, ప్రమాదానికి గురికావద్దని ఆయన సూచించారు.
Similar News
News November 5, 2024
NZB: మెడికల్ షాపులో చోరీకి పాల్పడ్డ దుండగులు
నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడీ ప్రాంతంలో ఉన్న ఓ మెడికల్ షాప్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి బైక్‌పై వచ్చిన ముగ్గురు మెడికల్ షాప్ తాళం పగులగొట్టి లోనికి చొరబడి రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇది అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News November 5, 2024
ఖతర్‌లో ముప్కాల్ వాసి గుండెపోటుతో మృతి
ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన తాడూరి లింబాద్రి (58) గురువారం రోజు రాత్రి గుండెపోటుతో మరణించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడు గత కొన్ని సంవత్సరాలుగా దోహాలో ఉపాధి నిమిత్తం జీవనం కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
News November 5, 2024
కామారెడ్డి: రైలు దిగుతుండగా కిందపడి వ్యక్తి మృతి
రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గాయపడిన ఓ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు HYD కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపారు. కామారెడ్డికి చెందిన జీడి సిద్దయ్య (70) వికారాబాద్ నుంచి రైలులో వస్తు విద్యానగర్ రైల్వే స్టేషన్‌లో దిగుతుండగా కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.