News March 11, 2025
నిజామాబాద్: TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ టి.గంగారం(55) ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన స్వస్థలం కోటగిరి మండలం సిద్దులం. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సిరిసిల్లలోని ఓ భవనంలో ఆయన లిఫ్ట్ యాక్సిడెంట్‌కు గురై మృతి చెందారని బెటాలియన్ వర్గాలు తెలిపాయి. ఆయన మృతి పట్ల బెటాలియన్ అధికారులు, సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 12, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో వైద్యుడి దుర్మరణం

నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయుర్వేద వైద్యుడు దుర్మరణం చెందాడు. నందిపేట్ మండలం తల్వేదకు చెందిన చిట్టెం హనుమాండ్లు(54) NZBలో గోల్ హనుమాన్ సమీపంలో ఆయుర్వేద ఆసుపత్రి నిర్వహించేవారు. బైక్‌పై తన దగ్గర పని చేసే శ్రీహరితో కలిసి వెళ్తుండగా పులాంగ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో హనుమాండ్లు మృతి చెందగా శ్రీహరికి గాయాలయ్యాయి.
News March 12, 2025
NZB: 477 మంది గైర్హాజరు

జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ 2వ సంవత్సరం బోటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్-2ఏ పరీక్షకు మొత్తం 477 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 17,064 మంది విద్యార్థులకు 16,587 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. బోధన్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇద్దరు విద్యార్థులు చీటీలు రాస్తుండగా పట్టుకుని మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశారన్నారు.
News March 12, 2025
NZB: గ్రూప్-2 ఫలితాల్లో జిల్లా వాసికి 6వ స్థానం

గ్రూప్-2 పోస్టుల రాత పరీక్షలో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను TGPSC విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఏర్గట్ల మండలం దొంచంద గ్రామానికి చెందిన ఎర్ర అఖిల్‌కు 430.807 మార్కులు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆయనను కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు అభినందించారు.