News February 6, 2025
నిడదవోలు: జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య

నిడదవోలు చిన్నకాశీరేవులో చాగల్లు మండలం నందిగంపాడు గ్రామానికి చెందిన ఆతుకూరి లింగేశ్వరరావు(44) అనే వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. 10 ఏళ్ల నుంచి భార్య తనతో విడిపోయి దూరంగా ఉంటుందనే బాధతో మద్యానికి బానిసై జీవితం మీద విరక్తి చెంది చిన్నకాశీరేవులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News December 8, 2025
తూ.గో: టెన్త్ విద్యార్థులకు సూచన

డిసెంబర్ 9 లోపు టెన్త్ పరీక్షా ఫీజు చెల్లించాలని డీఈవో వాసుదేవరావు తెలిపారు. జిల్లాలో టెన్త్ మార్చి -2026లో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు రెగ్యులర్ /2025 ఫెయిల్ అయిన విద్యార్థులు గమనించాలన్నారు. 10 – 12వ తేదీ లోపు రూ.50, 13-15వ తేదీ వరకు రూ.200, 16 – 18 వరకు రూ.2,500 ఫైన్తో చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్కూల్ లాగిన్ ద్వారానే ఫీజ్ చెల్లించాల్సి ఉంటుందన్నారు.
News December 8, 2025
పట్టు బిగిస్తున్న కందుల దుర్గేశ్

నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ పట్టు బిగిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నైనా సీటు త్యాగం చేసిన బూరుగుపల్లి శేషారావుకి మళ్లీ ఛాన్స్ ఇస్తారా? అన్నది సందేహంగానే ఉంది. ఇప్పటికే మున్సిపాలిటీలో జనసేన పాగా వేసింది. 6 పీఎసీఎస్, ఏఎంసీ, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో జనసేన ఆధిపత్యం నడుస్తోంది. మంత్రి వ్యూహాత్మకంగా జనసేనను బలోపేతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శేషారావు రాజకీయ భవిష్యత్తు చర్చనీయాంశం అయింది.
News December 8, 2025
నిడదవోలు మున్సిపాలిటీలో తారుమారైన పార్టీ బలాలు

నిడదవోలు మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. గత ఎన్నికల్లో 28 స్థానాలకు గాను 27 గెలుచుకున్న వైసీపీ బలం ప్రస్తుతం 12కు పడిపోయింది. ఒక్క కౌన్సిలర్ లేని జనసేన ఏకంగా 15 మంది సభ్యులతో పాటు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలను దక్కించుకుంది. ఇక్కడి జనసేన ఎమ్మెల్యే మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీకి కలిసొచ్చింది. ఇదే సమయంలో టీడీపీ ఇక్కడ ఉనికి కోల్పోవడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.


