News July 3, 2024
నిడదవోలు: నేటి నుంచి రైళ్ల దారి మళ్లింపు

పెద అవుటుపల్లి-గన్నవరం మధ్య ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా నేటి నుంచి నడిచే పలు రైళ్లను నిడదవోలు-గుడివాడ- విజయవాడ మార్గంలో నడుపుతున్నట్లు ద.మ. రైల్వే విజయవాడ డివిజన్ పిఆర్ నుస్రత్ మంద్రుపాకర్ తెలిపారు. విశాఖపట్నం-కొల్లాం మధ్య నడిచే నిడదవోలు- గుడివాడ- విజయవాడ రైలు మార్గంలో నడపనున్నట్లు తెలిపారు. ధన్బాద్-తాంబరం ఎక్స్ప్రెస్, బరోని-మంగుళూరు సెంట్రల్ ఎక్స్ ప్రెస్ నిడదవోలు- విజయవాడ మార్గంలో నడుస్తాయన్నారు.
Similar News
News October 22, 2025
ఈనెల 27న TPG లో కొనుగోలు కేంద్రం ప్రారంభం: జేసీ

ఈనెల 27న తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు జేసీ రాహుల్ తెలిపారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతు సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు.
News October 21, 2025
భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జై సూర్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. డీఎస్పీ పరిధిలో పేకాట స్థావరాలు పెరగడం, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారశైలిపై జిల్లా ఎస్పీ అదాన్ నయీమ్ అస్మితో మంగళవారం మాట్లాడిన పవన్, వెంటనే డీఎస్పీపై విచారణకు ఆదేశించి, నివేదికను హోం శాఖకు, డీజీపీకి పంపించాలని ఆదేశించారు.
News October 21, 2025
పేరుపాలెం బీచ్ సందర్శకులకు అనుమతి లేదు: ఎస్ఐ

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున బుధవారం పేరుపాలెం బీచ్లోకి సందర్శకులను అనుమతించడం లేదని మొగల్తూరు ఎస్సై జి. వాసు తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.