News December 2, 2024

నిడదవోలు: పని ఒత్తిడి తగ్గించాలని పంచాయతీ కార్యదర్శుల వినతి

image

పని ఒత్తిడి తగ్గించాలంటూ నిడదవోలు మండల పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో డి. లక్ష్మినారాయణకు వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సర్వేలు, వివిధ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పని ఒత్తిడి తగ్గించాలని కోరారు.  ఓ పక్క చేయాల్సిన పని, మరోపక్క వరుస వీడియో కాన్ఫరెన్సులు, సమీక్షలతో ఇబ్బందిగా ఉందని అన్నారు. 

Similar News

News February 11, 2026

తణుకు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో మృతి

image

తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో అందే వీర వెంకట సత్య తాతారావు (56) గుండెపోటుతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. బుధవారం ఉదయం ఆసుపత్రికి వచ్చిన ఆయన ఆరోగ్యం బాగాలేదని ఈసీజీ తీయించుకొని కారులో తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో గుండెపోటు వచ్చింది. దీంతో తాతారావును తణుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News February 11, 2026

యనమదుర్రు పెట్రోల్ బంక్‌లో జేసీ ఆకస్మిక తనిఖీ

image

యనమదుర్రులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌ను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నాణ్యత, కొలతలు, ధరల ప్రదర్శనతో పాటు భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని, ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.

News February 11, 2026

మహాశివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

కాళ్ల(M) పెదమిరం క్యాంప్ కార్యాలయంలో శివరాత్రి ఉత్సవాలపై సంబంధిత అధికారులతో గూగుల్ మీట్‌ను బుధవారం కలెక్టర్ నాగరాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలైన 2 ప్రముఖ పంచారామ క్షేత్రాలు భీమవరం సోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయాలకు లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరు అవుతారని, వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని ఏర్పాట్లు చేయాలన్నారు.