News December 28, 2024
నిడదవోలు: యువతి అదృశ్యంపై కేసు నమోదు

నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన దేనాబోయిన అమర్నాథ్ కుమార్తె సునీత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై వీరబాబు తెలిపారు. శనివారం ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సునీత నిడదవోలు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియెట్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతుందన్నారు. ఈనెల 27న ఉదయం కళాశాలకు వెళ్లి ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదని, అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News January 11, 2026
భీమవరంలో రౌడీయిజం.. మద్యం మత్తులో దాడి!

భీమవరం రైతు బజార్ సమీపంలోని వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఒకరిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదుతో వన్ టౌన్ ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు హెచ్చరించారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
News January 10, 2026
ప.గో: కోట్లల్లో పందేలు.. ఎందుకంటే!

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ శాశ్వత భవన నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుందని స్పష్టం చేసినా, అటు భీమవరం.. ఇటు ఉండి నియోజకవర్గాల మధ్య ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో భవనం ఎక్కడ నిర్మిస్తారనే అంశంపై జిల్లాలోని జూదరలు రూ.కోట్లలో పందాలు కాస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
News January 10, 2026
మొగల్తూరు: కొత్త పాసు పుస్తకాలకు దరఖాస్తు చేసుకోండి

పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు సరి చూసుకుని కొత్త పాసు పుస్తకాలకు దరఖాస్తు చేసుకోవాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. శనివారం మొగల్తూరు మండలం శేరేపాలెం రెవెన్యూ విలేజ్ కొత్తపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులను కలిసి జేసీ మాట్లాడారు. పాసు పుస్తకాలలో ఉన్న ఫొటో, పేరు, సర్వే నంబరు, విస్తీర్ణం, ఆధార్ నంబరు, వంటివి ఏమైనా తప్పిదాలు ఉంటే పరిశీలించుకుని సరి చేయించుకోవాలన్నారు.


