News January 20, 2025
నిడదవోలు విద్యార్థి విజయనగరంలో ఆత్మహత్య

తూ.గో జిల్లా నిడదవోలుకు చెందిన MBBS వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్ ఆదివారం నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ సభ్యుల వేదనకు తానే కారణమవుతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News February 15, 2025
రాజమండ్రి: దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

బిక్కవోలు కేంద్రంగా దోంగ నోట్లును ముద్రిస్తున్న ఐదుగురి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ.. దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠా నుంచి 1.07 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేశామన్నారు. బిక్కవోలుకు చెందిన మెకానిక్ నకిలీ నోట్లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి నకిలీ నోట్ల గుట్టురట్టు చేశారు.
News February 15, 2025
రాజమండ్రి: జిల్లాలో దడ పుట్టిస్తున్న ‘జీబీఎస్’

గులియన్ బారే సిండ్రోమ్ ఉమ్మడి గోదావరి జిల్లాలను తాకింది. ఇప్పటివరకు కాకినాడ GGHలో 16 కేసులు, రాజమండ్రి GGHలో ఓ కేసు నమోదైంది. ప.గోకు చెందిన వ్యక్తి ప్రస్తుతం కాకినాడలో చికిత్స పొందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాళ్లు, చేతులు తిమ్మిర్లు, కండరాల నొప్పులు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. వ్యాధి ముదిరిన దశలో అవయవాలు చచ్చుబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
News February 15, 2025
గుండెపోటు లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు: కలెక్టర్

కోవిడ్ మహమ్మారి పరిస్థితి తరువాత గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, వీటి ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రభుత్వం ద్వారా అందచేస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. ప్రజల్లో గుండె జబ్బులు, వాటికి సంబంధించిన లక్షణాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.