News June 28, 2024
నిడదవోలు: సమన్వయంతో పనిచేయాలి: మంత్రి దుర్గేష్

ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్ధిదారులైన పేదలకు అందించడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల స్థాయి అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
Similar News
News October 20, 2025
నరసాపురంలో కూతురిపై తండ్రి అత్యాచారం

నరసాపురంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎస్ఐ విజయలక్ష్మి వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. కుమార్తె(13) 9వ తరగతి చదువుతోంది. భర్త మద్యానికి బానిసయ్యాడు. జులైలో కుమార్తె(13)పై మద్యం మత్తులో తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల తల్లి గల్ఫ్ నుంచి వచ్చింది. విషయం తెలుసుకుని పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది.
News October 20, 2025
భీమవరం: నేడు పీజీఆర్ఎస్ రద్దు

దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం దీపావళి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.
News October 20, 2025
పాలకోడేరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

పాలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దీపావళి సందర్భంగా ఈ సోమవారం రద్దు అయినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.