News July 11, 2024

నిడదవోలు: TDP, జనసేనలోకి YCP నాయకులు.?

image

నిడదవోలు నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నేతలు టీడీపీ, జనసేనలో చేరేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. 3ఏళ్ల కిందట పురపాలక ఎన్నికల్లో 27 వార్డుల్లో వైసీపీ, ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి గెలవగా.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో పలువురు కౌన్సిలర్లు పార్టీ మారేందుకు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేశ్ మంత్రి అయిన విషయం తెలిసిందే.

Similar News

News December 9, 2025

తూ.గో: విదేశీ ఉద్యోగాల ఎర.. రూ.4 కోట్లకు టోకరా

image

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి రూ. 4 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం నిడదవోలు మండలం గోపవరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. యంట్రపాటి విజయలక్ష్మి, భాగ్యం తదితరులు తమను నిండా ముంచారని బాధితులు వాపోయారు. డబ్బులు తిరిగి అడిగితే ముఖం చాటేస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్, జిల్లా జడ్జికి వారు ఫిర్యాదు చేశారు.

News December 9, 2025

విదేశీ ఉద్యోగాల ఎర.. రూ.4 కోట్లకు టోకరా

image

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి రూ. 4 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం నిడదవోలు మండలం గోపవరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. యంట్రపాటి విజయలక్ష్మి, భాగ్యం తదితరులు తమను నిండా ముంచారని బాధితులు వాపోయారు. డబ్బులు తిరిగి అడిగితే ముఖం చాటేస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్, జిల్లా జడ్జికి వారు ఫిర్యాదు చేశారు.

News December 9, 2025

రాజమండ్రి: ప్లాస్టిక్ రహిత నగరం వైపు.. ‘రీసైక్లింగ్ లీగ్’

image

RJYలో ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణే లక్ష్యంగా నగరపాలక సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ‘ప్లాస్టిక్ రీసైక్లింగ్ లీగ్’ పోస్టర్‌ను కమిషనర్ రాహుల్ మీనా ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ముప్పుపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు లీగ్ దోహదపడుతుందన్నారు. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.