News July 11, 2024
నిడదవోలు: TDP, జనసేనలోకి YCP నాయకులు.?

నిడదవోలు నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నేతలు టీడీపీ, జనసేనలో చేరేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. 3ఏళ్ల కిందట పురపాలక ఎన్నికల్లో 27 వార్డుల్లో వైసీపీ, ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి గెలవగా.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో పలువురు కౌన్సిలర్లు పార్టీ మారేందుకు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేశ్ మంత్రి అయిన విషయం తెలిసిందే.
Similar News
News February 19, 2025
27న తూ.గో జిల్లాలో సెలవు

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పలువురు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈక్రమంలో 27వ తేదీన స్పెషల్ లీవ్ మంజూరైందని ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవును అడ్జస్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.
News February 19, 2025
కొవ్వూరు : గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

కొవ్వూరు ఇంటిలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న డేవిడ్ రాజు మంగళవారం సాయంత్రం మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
News February 19, 2025
రాజమండ్రి: జగన్ జైలుకు వెళ్లడం ఖాయం: గన్ని కృష్ణ

చేసిన తప్పుకు జైలు ఊచలు లెక్కపెడుతున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలోనే జగన్ జైలుకు వెళ్ళడం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ జోస్యం చెప్పారు. భవిష్యత్‌లో తాను వెళ్ళబోతున్న జైల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోడానికి జగన్ వెళ్ళాడా అనే అనుమానాలు ఉన్నాయన్నారు. నాడు చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టిన రోజులను మరిచిపోయినట్లుగా జగన్ నీతులు చెబితే ఎలా అని గన్ని ఎద్దేవా చేశారు.