News March 25, 2024

నిడమనూరు: హోలీ వేడుకలకు దూరం

image

నిడమనూరు మండల పరిధిలోని ముప్పారం గ్రామంలో ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా ఉండటం ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తోంది. రోజంతా శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తారు. దీంతో ఆ గ్రామస్థులు హోలీ వేడుకలకు దూరంగా ఉంటారు. స్వామివారి కల్యాణోత్సవానికి వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.

Similar News

News November 18, 2025

చిత్తడి నేలల గుర్తింపు పూర్తి చేయాలి: కలెక్టర్

image

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపు కార్యక్రమాన్ని శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చిత్తడి నేలల గుర్తింపును పూర్తి చేయాలని అన్నారు.

News November 18, 2025

స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌‌గా డా. కె.అరుణప్రియ

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా డా కె.అరుణప్రియను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. డా.కె అరుణప్రియ ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా ఏడాది కాలం పాటు సేవలందించనున్నారు. ఈ సందర్భంగా అరుణప్రియను అధికారులు, విద్యార్థులు అభినందించారు.

News November 18, 2025

నల్గొండను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలి

image

నషాముక్త భారత్‌ కార్యక్రమం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చే దిశగా ప్రతి విద్యా సంస్థ కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఐదో వార్షికోత్సవం నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటానని అందరూ ప్రతిజ్ఞ చేయాలని తెలిపారు.