News March 25, 2024

నిడమనూరు: హోలీ వేడుకలకు దూరం

image

నిడమనూరు మండల పరిధిలోని ముప్పారం గ్రామంలో ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా ఉండటం ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తోంది. రోజంతా శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తారు. దీంతో ఆ గ్రామస్థులు హోలీ వేడుకలకు దూరంగా ఉంటారు. స్వామివారి కల్యాణోత్సవానికి వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.

Similar News

News February 8, 2026

NLG: ఓట్ల లెక్కింపునకు వేదిక ఖరారు.. 3 రోజులు సెలవు!

image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం నిడమనూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను కౌంటింగ్ కేంద్రంగా అధికారులు ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈ పాఠశాలకు ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు స్థానిక సెలవులను ప్రకటించారు. లెక్కింపు ప్రక్రియకు ఆటంకం కలగకుండా ప్రిన్సిపాల్ తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

News February 8, 2026

NLG: గల్లంతైన వ్యక్తి కోసం NDRF గాలింపు!

image

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో కారు పడి గల్లంతైన పుల్లయ్య కోసం NDRF బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. నిన్న జరిగిన ప్రమాదంలో భార్య పద్మ మృతదేహం లభించగా, భర్త జాడ తెలియక పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఘటనను ప్రమాదమా లేక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో అతడిని విచారిస్తున్నారు.

News February 8, 2026

NLG: 22 మంది ఎంఈఓలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు

image

ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన 22 మంది మండల విద్యాధికారులపై (MEOs) నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 30 నాటికి పూర్తి కావాల్సిన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనందుకు వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల ఉపకార వేతనాల విషయంలో అలసత్వం వహించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.