News December 19, 2024
నిడమర్రు: అశ్లీల నృత్యాల ఘటనలో 21 మంది అరెస్ట్
నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామంలో జరిగిన అశ్లీల నృత్యాలపై నిడమర్రు పోలీస్ స్టేషన్‌లో గురువారం కేసు నమోదు అయింది. ఈ ఘటనకు సంబంధించి నిర్వాహకులు, పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నృత్యం చేసిన ఒక హిజ్రాతో పాటు మొత్తం 21 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News January 13, 2025
ప.గో: భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
News January 12, 2025
భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
News January 12, 2025
దేవరపల్లి హైవే పై యాక్సిడెంట్.. స్పాట్‌డెడ్
దేవరపల్లి మండలం సూర్యనారాయణ పురం హైవే పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మృతుడు కందిపల్లి సత్యనారాయణ (26)గా గుర్తించారు. పండుగ నిమిత్తం హైదరాబాద్ నుంచి స్వగ్రామం బిక్కవోలుకు బైక్ పై వస్తున్నాడు. యర్లగూడెం టోల్‌గేట్ దాటిన తర్వాత బైక్ పై వెనుక కూర్చున్న సత్యనారాయణ నిద్ర మత్తులో కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.