News March 5, 2025
నిడమర్రు: ఆక్వా రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఆక్వా రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిడమర్రు(M) గుణపర్రులో జరిగింది. గ్రామంలో రొయ్యలు చెరువు సాగు చేస్తున్న నిమ్మల శ్రీను సుమారు రూ.కోటి మేర నష్టపోయాడు. అప్పులు తీర్చలేనని మనోవేదనకు గురై విషం తాగాడు. ఆ తర్వాత సోదరుడికి ఫోన్ చేయడంతో బంధువులు గాలించి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 18, 2025
లింగపాలెం కుర్రోడికి సినిమా హీరోగా ఛాన్స్

సినిమా యాక్టర్లు అంటే పల్లెల్లో, గ్రామీణ ప్రాంతాలలో ఓ క్రేజ్ ఉంటుంది. లింగపాలెంకు చెందిన తరుణ్ సాయి హీరోగా సినిమాలో నటిస్తున్నాడు. ఈ ప్రాంత ప్రజలు ఎవరూ ఊహించిన విధంగా తరుణ్ సాయి హీరో అయ్యాడు. స్థానిక శ్రీనివాసరావు, కుమారి దంపతుల పెద్ద కుమారుడికి హీరోగా అవకాశం వచ్చింది. ఈయన హీరోగా నటించిన పెళ్లిరోజు సినిమా దాదాపు పూర్తైంది. ఏప్రిల్‌లో విడుదల చేయటానికి సిద్ధమవుతున్నారు.
News March 18, 2025
కాళ్ల : శివయ్యను తాకిన సూర్యకిరణాలు

కాళ్ల మండలం సీసలి గ్రామంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అద్భుత సన్నివేశం చోటుచేసుకుంది. గర్భాలయంలోని శివలింగాన్ని సుమారు పది నిమిషాల పాటు సూర్యకిరణాలు తాకాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఆదివారం నుంచి వరుసగా మూడు రోజులపాటు స్వామివారి లింగాన్ని సూర్యకిరణాలు తాకటం విశేషమని తెలిపారు. భక్తులు తరలివచ్చి అద్భుత సన్నివేశాన్ని చూస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
News March 18, 2025
ప.గో జిల్లాకు కొత్త అధికారి

ప.గో జిల్లా DMHOగా డాక్టర్ జి. గీతాబాయి నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెను నియమిస్తూ.. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎం. కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. పూర్వ డీఎంహెచ్వో డా. మహేశ్వరరావు గత ఏడాది డిసెంబరులో పదవీ విరమణ చేయగా.. అప్పటి నుంచి డా. బానూనాయక్ బాధ్యతలు చూసుకుంటున్నారు. గీతాబాయి నేడు బాధ్యతలు చేపట్టనున్నారు.