News February 20, 2025
నిడమర్రు: భార్య ఫోన్ నుంచి మెసేజ్.. ఇంటికి రాగానే హత్య

నిడమర్రులోని బావాయిపాలెంలో మజ్జి ఏసు హత్య కేసులో ఏసుబాబు, అన్నవరం, శ్రీనివాసరావును బుధవారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రావణ్ కథనం..పిల్లి ఏసుబాబు భార్యతో మజ్జి ఏసు బాబుకు వివాహేతర సంబంధం ఉంది. పెద్దల సమక్షంలో వార్నింగ్ ఇచ్చినా వారి తీరు మారలేదు. దీంతో పిల్లి ఏసు భార్య ఫోను నుంచి 15 రోజుల ముందు నుంచే పథకం ప్రకారం మెసేజెస్ చేసేవారు. ఈనెల 15న ఆమె ఇంటికి రప్పించుకుని, ఒక చోటుకి తీసుకెళ్లి హత్య చేశారు.
Similar News
News November 3, 2025
జూడో పోటీల్లో అదిలాబాద్ క్రీడాకారుల ప్రతిభ

హనుమకొండ వేదికగా నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్ 17 ఎస్జీఎఫ్ఐ జూడో పోటీల్లో జిల్లా క్రీడా పాఠశాలకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. ఏకంగా 12 పతకాలతో మెరిశారు. బాలికల విభాగంలో నాగిని ప్రియ, సహస్ర, సింధు, అక్షిత, ప్రణీత, శృతిలు విజేతలుగా నిలవగా, బాలుర విభాగంలో మనోజ్, తరుణ్, హర్షవర్ధన్, లోకేష్, మధు, సంతోష్ అనే క్రీడాకారులు సత్తా చాటారనీ జూడో కోచ్ రాజు తెలిపారు.
News November 3, 2025
సర్పాలు, నాగులు ఒకటి కాదా?

పురాణాల ప్రకారం.. సర్పాలు, నాగులు వేర్వేరని పండితులు చెబుతున్నారు. సర్పాలంటే భూమిపై తిరిగే పాములని, నాగులంటే దైవ స్వరూపాలని అంటున్నారు. ‘సర్పాలు విషపూరితమైనవి. నాగులు విషరహితమైనవి. నాగులు కోరుకున్న రూపాన్ని ధరించగలవు. అలాగే వీటికి ప్రత్యేకంగా ‘నాగ లోకం’ కూడా ఉంది. ఇవి గాలిని పీల్చి జీవిస్తాయి. కానీ సర్పాలు నేల/నీటిలో మాత్రమే ఉంటాయి. ఇవి నేలను అంటిపెట్టుకొని పాకుతాయి’ అని వివరిస్తున్నారు.
News November 3, 2025
రూ.500కే రూ.16 లక్షల ప్లాటు గెలిచింది

TG: లాటరీలో ఓ 10 నెలల చిన్నారిని అదృష్టం వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో తీసిన లక్కీ డ్రాలో రూ.500కే ఏకంగా రూ.16 లక్షల విలువైన ప్లాటును గెలుచుకుంది. రామ్ బ్రహ్మచారి అనే వ్యక్తి 66 గజాల ప్లాటుకు లక్కీ డ్రా నిర్వహించారు. శంకర్ అనే వ్యక్తి ఫ్యామిలీ పేరుతో 4 కూపన్లు తీసుకోగా.. 2307 అనే నంబరుతో కుమార్తె హన్సికకు ఈ బహుమతి దక్కింది. రూ.500కే ప్లాటు దక్కడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.


