News March 11, 2025
నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి భేటీ

మంత్రి KVR ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాలపై ఆయనతో సమగ్ర చర్చలు జరిపారు. టెన్నాలీ-HYD ఎక్స్‌ప్రెస్ హైవే, WGL – KMM జాతీయ రహదారి విస్తరణ, HYD రింగ్ రోడ్డు విస్తరణ అంశాలపై KVR గడ్కరీతో ప్రస్తావించారు. TGలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారి ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరారు.
Similar News
News March 19, 2025
అలంపూర్‌లో విషాదం.. వ్యక్తి ఆత్మహత్య

ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ వేధింపులు తట్టుకోలేక గత 20 రోజుల క్రితం నిప్పంటించుకున్న వ్యక్తి కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన నర్సింహులు ఆత్మహత్యకు యత్నించి సోమవారం రాత్రి మృతిచెందినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఓ ఫైనాన్స్ కంపెనీ వారు అతడిని వేధించారని, దీంతో ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలన్నారు.
News March 19, 2025
మహబూబ్‌నగర్: ‘బీసీ బిల్లు రాజ్యాధికారానికి తొలిమెట్టు’

బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ కల్పించడంలో బీసీ సంఘాల ముఖ్యపాత్ర ఉందని బీసీ ఐక్యవేదిక ఉద్ఘటించింది. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ MBNRలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42%రిజర్వేషన్లు ప్రకటించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షణీయమన్నారు. బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
News March 19, 2025
వెంకటాపురం: కూలీలు కొరత.. రైతు ఆత్మహత్య

మిర్చి ఏరెందుకు కూలీలు దొరకక కాయలు ఎండుతుండటంతో ఓ రైతు మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై తిరుపతిరావు వివరాలు.. వెంకటాపురంకు చెందిన సతీశ్ 3 ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. గత 2 వారాలుగా కూలీలు దొరకడం లేదని భయంతో మనస్థాపం చెందాడు. మద్యం మత్తులో పురుగుమందు తాగగా కుటుంబీకులు వెంకటాపురం ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం హన్మకొండ తరలించారు. కాగా, చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడన్నారు.