News June 28, 2024

నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ ఈటల

image

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. మల్కాజ్గిరి పార్లమెంటు సమస్యలతో పాటు హుజురాబాద్ నియోజకవర్గంలోని సింగపూర్, రాంపూర్, రంగాపూర్, పెద్ద పాపయ్య పల్లి మీదుగా వేస్తున్న సర్వీస్ రోడ్డు నిర్మాణం వలన రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు.

Similar News

News November 26, 2025

KNR: జిల్లా మ్యూజియం అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

image

కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం జిల్లా మ్యూజియంను సందర్శించి, అన్ని విభాగాలను పరిశీలించారు. మ్యూజియం అభివృద్ధి, సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు, కొత్త ప్రదర్శనల ఏర్పాటు వంటి అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మ్యూజియం ఆధునికీకరణకు అవసరమైన చర్యలను త్వరగా చేపట్టాలని ఆమె సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కూడా ఉన్నారు.

News November 26, 2025

‘పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి’

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. ఈరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కరీంనగర్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను 3 విడతలలో నిర్వహిస్తామని, డిసెంబర్ 11న 1 విడత, డిసెంబర్ 14న 2వ విడత, డిసెంబర్ 17న 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు.

News November 26, 2025

KNR: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ప్రతిజ్ఞ

image

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులు, సిబ్బంది చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశ రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు వుందని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధికి కట్టుబడి వుండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.