News March 30, 2025

నితీశ్ కుమార్ రెడ్డి డక్ అవుట్

image

విశాఖ వేదికగా జరుగుతున్న ఢిల్లీ-SRH మ్యాచ్‌లో లోకల్ బాయ్ నితీశ్ కుమార్ రెడ్డి నిరాశ పర్చారు. రెండు వికెట్లు పడ్డ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్.. స్టార్క్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డక్ అవుట్ అయ్యారు.

Similar News

News April 3, 2025

KMR: ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. రామారెడ్డి మండలం కన్నాపూర్‌లో గురువారం కలెక్టర్ కొబ్బరి కాయ కొట్టి ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులో ఎరువుల తయారీని పరిశీలించారు. పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News April 3, 2025

నారాయణపేట జిల్లాలో అమ్మాయిల వెంట పడితే అంతే..!

image

NRPT జిల్లాలో షీటీం సేవలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఊట్కూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు షీ టీం పోలీసులు అవగాహన కల్పించారు. షీ టీం పోలీస్ అధికారి బాలరాజు మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలల్లో ఎవరైనా అమ్మాయిలను వేధించినా, వారి వెంట పడినా, అసభ్యంగా ప్రవర్తించినా, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే షీటీం పోలీసుల నంబర్ 8712670398కి కాల్ చేయాలన్నారు. 

News April 3, 2025

BREAKING: గురుకుల CET ఫలితాలు విడుదల

image

TG: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం FEB నెల 23న నిర్వహించిన TG CET ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురుకులాల్లో మొత్తం 51,408 సీట్లు ఉండగా, ఫలితాల్లో 36,334 మంది సీట్లు పొందారు. వివిధ కేటగిరీలకు చెందిన 13,130 సీట్లకు గాను త్వరలోనే ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

error: Content is protected !!