News December 28, 2024
నితీష్ కుమార్ రెడ్డి ఫ్యూచర్లో కెప్టెన్ అవుతారు: కేటీఆర్

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ తరపున సెంచరీ చేసిన యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు. టెర్రిఫిక్ ఇన్నింగ్స్ నితీశ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యూచర్ కెప్టెన్ నితీశ్ అంటూ ఆకాశానికి పొగిడారు.
Similar News
News February 24, 2026
KNR: డిజిటల్ జూదం.. పోలీసులకు సవాల్!

కరీంనగర్ జిల్లాలో పేకాటరాయుళ్లు పంథా మార్చారు. పోలీసులకు చిక్కకుండా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా నగదు బదిలీ చేస్తూ జూదం ఆడుతున్నారు. శివారు ప్రాంతాల్లోని తోటలు, కోళ్ల ఫారాలను అడ్డాలుగా మార్చుకొని.. బయట కాపలాదారులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. గత మూడేళ్లలో 1,433 మందిని పోలీసులు పట్టుకున్నా.. తాజా సాంకేతిక పోకడలు, పక్కా నిఘా వ్యవస్థ వారికి సవాలుగా మారాయి.
News February 24, 2026
చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికి కరీంనగర్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నేడు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఉదయం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన అనంతరం, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించి, స్థానిక నాయకులతో భోజన కార్యక్రమంలో పాల్గొంటారు.
News February 24, 2026
KNR: ఆన్‌లైన్ హాల్ టికెట్‌తో అనుమతి

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,426 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 57 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఆన్‌లైన్ హాల్ టికెట్‌తోనే పరీక్షలకు హాజరుకావచ్చని RIEO గంగాధర్ స్పష్టం చేశారు.


