News August 20, 2024

నిత్యం అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

image

అనంతపురం జిల్లాలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లాలోని డీఎస్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని తాజా పరిస్థితులను సమీక్షించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజల్లో భరోసా కలిగించడంలో దోహదం చేసే బేసిక్ పోలీసింగ్‌ను మెరుగు పరుచుకోవాలన్నారు.

Similar News

News December 6, 2025

చంద్రబాబూ.. గంగిరెద్దులా తలూపొద్దు: అనంత వెంకటరామిరెడ్డి

image

రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కేంద్రంతో పోరాడాల్సిన చంద్రబాబు.. రైతులను పణంగా పెట్టి తన పాత కేసులను మాఫీ చేసుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉందంటే అది ఇక్కడి ఎంపీల వల్లేనని గుర్తు చేశారు. ఒక్క వార్నింగ్‌ ఇస్తే కేంద్రం దిగి వస్తుందని, కానీ చంద్రబాబు మాత్రం తన స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద గంగిరెద్దులా తలూపుతున్నారని మండిపడ్డారు.

News December 6, 2025

580 మార్కులు సాధిస్తే విమాన విహారం: ఎమ్మెల్యే సురేంద్రబాబు

image

పదో తరగతిలో 580 మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేశ్ వద్దకు తీసుకువెళ్లి విమాన విహారానికి అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. కళ్యాణదుర్గం మోడల్ స్కూల్లో శుక్రవారం ఏర్పాటుచేసిన మెగా టీచర్స్, పేరెంట్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.