News June 20, 2024

నిత్యవసర వస్తువుల సరఫరాకు టెండర్ల స్వీకరణ: కలెక్టర్

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 27 గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య మోడల్ విద్యాలయాలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయుటకు ఆసక్తిగల వారి నుంచి టెండర్లు స్వీకరిస్తున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈనెల 21 నుండి 25 వరకు టెండర్ పారంలను ఉ. 10:30 గంటల నుంచి సా.ఐదు గంటల వరకు కార్యాలయం పని దినాలలో టెండర్ షెడ్యూల్ ఐటీడీఏలోని ప్రాంతీయ సమన్వయ అధికారి గురుకులం కార్యాలయం నందు పొందాలన్నారు.

Similar News

News September 11, 2024

దుమ్ముగూడెం: తూరుబాక ప్రధాన రహదారిలో రాకపోకలు బంద్

image

దుమ్ముగూడెం మండలం తూరుబాక ప్రధాన రహదారిపై బుధవారం గోదావరి వరద నీరు చేరింది. దీంతో స్థానిక ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి వద్ద అధికారులు రాకపోకలను నిలిపివేశారు. గోదారి నీరు చేరిన రహదారులను దాటే ప్రయత్నం చేసి ప్రమాదాలకు గురి కావద్దని అధికారులు సూచించారు.

News September 11, 2024

ఖమ్మం జిల్లాలో 15వేల ఎకరాల్లో పంటనష్టం

image

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టిన సర్వే ఓ కొలిక్కి వస్తోంది. సర్వేలో భాగంగా 12,014 మంది రైతులకు చెందిన 15,058 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు మంగళవారం నాటికి గుర్తించారు. ఇందులో వరి 10,844 ఎకరాలు ఉంది. మధిర, కూసుమంచి మండలాల్లో సర్వే కొనసాగుతుండగా మరో రెండు, మూడు రోజుల్లో నష్టంపై స్పష్టత రానుంది.

News September 11, 2024

కామేపల్లి:బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు

image

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్త లింగాలకి చెందిన బాలికపై లైంగిక దాడి కేసులో ఇద్దరు నిందితులు ఏ1. పండగ నాగేంద్రబాబు(22) ఏ2. పండగ రాంబాబు(24)లకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. ఏ1.కు 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా.. ఏ2.కు 10 సంవత్సరాల శిక్ష విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి కె. ఉమాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ఆటోలో వెళ్తున్న బాలికను అడ్డగించి అత్యాచారం చేశారు.