News March 15, 2025
నిత్యవసర సరుకుల విక్రయాలపై అప్రమత్తంగా ఉండాలి: అల్లూరి కలెక్టర్

అల్లూరి జిల్లా పాడేరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం వినియోగదారుల వ్యవహారాల సదస్సులో కలెక్టర్ దినేశ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజలందరూ స్థిరమైన జీవనశైలికి అలవాటు పడ్డారన్నారు. యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, వృద్ధుల్లో ఆలోచన విధానం మారాలని చెప్పారు. సంతల్లో విక్రయించే నాసిరకం పదార్థాలు, శీతల పానీయాలు విక్రయాలపై దృష్టి పెట్టాలన్నారు. కల్తీ నిత్యవసర సరుకుల అమ్మకాలపై చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News October 18, 2025
బ్రిటన్‌లో ‘ఆధార్’ తరహా వ్యవస్థ?

ఆధార్ కార్డు తరహా వ్యవస్థను UKలో తీసుకురావాలని ఆ దేశ PM స్టార్మర్ భావిస్తున్నారు. తమ డిజిటల్ ఐడెంటిటీ ప్రోగ్రామ్ ‘బ్రిట్ కార్డ్’కు ఆధార్‌ను ప్రేరణగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌లో మాదిరి సంక్షేమం, సర్వీసుల కోసం కాకుండా ఇల్లీగల్ మైగ్రెంట్ వర్కర్ల కట్టడికి ఈ వ్యవస్థను వాడుకోనున్నట్లు సమాచారం. తన ముంబై పర్యటన సందర్భంగా ఆధార్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వారితో స్టార్మర్ భేటీ అయ్యారు.
News October 18, 2025
ములుగు: మేము లొంగిపోతాం: ‘మావో’ లేఖ

అగ్రనాయకుల లొంగుబాట్లతో అడవులు ఖాళీ అవుతున్నాయి. మొన్న మల్లోజుల వేణుగోపాల్ టీం, నిన్న తక్కళ్లపల్లి వాసుదేవరావు@ ఆశన్న టీం లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా ఉదంతి ఏరియా కమిటీ కార్యదర్శి సునీల్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాము సైతం లొంగిపోనున్నట్లు లేఖలో వెల్లడించారు. నేటి పరిస్థితుల్లో ఆయుధాలతో యుద్ధం చేయలేమని, సీసీ కమిటీ నిర్ణయం తీసుకోవడంలో విఫలమైందన్నారు.
News October 18, 2025
ములుగు: రూ.500కు ప్లాట్.. ట్రెండింగ్‌లో లక్కీ డ్రా స్కీమ్స్..!

ఇండ్లు, ఇంటి స్థలాల అమ్మకంలో ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆకర్షనీయమైన లక్కీ డ్రా పేరుతో సరికొత్త విధానం పాటిస్తున్నారు. రూ.500 నుంచి రూ.600కే ప్లాటు గెలుచుకోండి.. అంటూ టోకెన్లు అమ్ముతున్నారు. ఇప్పుడు ములుగు జిల్లాలో ఈ తరహా లక్కీ డ్రా విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది యజమానులు తమ ఇంటి స్థలాలను డ్రా పద్ధతిలో అమ్ముకునేందుకు ముందుకు వస్తుండటం విశేషం.