News March 29, 2025
నిధులు కేటాయింపులు నిబంధనలు పాటించాలి: కలెక్టర్

తుడా పరిధిలోని అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు కేటాయింపు విషయంలో అధికారులు నిబంధనలు పాటించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శనివారం తిరుపతిలోని తుడా కార్యాలయంలో నగర కమిషనర్ మౌర్యతో కలిసి ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. తుడాకు సంబంధించి 2025 -26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.611 బడ్జెట్ కు ఆమోదం తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ నిధులతో అభివృద్ధి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు
Similar News
News November 23, 2025
NZB: సాధారణ కార్యకర్త నుంచి డీసీసీ అధ్యక్షుడిగా..!

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నగేష్ రెడ్డి నియమితులయ్యారు. రూరల్ మండలం మోపాల్కు చెందిన ఆయన కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి అంచలంచెలుగా ఎదిగారు. పీసీసీ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా పనిచేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యేగా టికెట్ ఆశించిన, చివరకు భూపతి రెడ్డికి అధిష్టానం టికెట్ ఖరారు చేసింది.
News November 23, 2025
లేటెస్ట్ సినిమా అప్డేట్స్

⭒ ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న సినిమాకు రూ.120 కోట్ల బడ్జెట్: సినీ వర్గాలు
⭒ ఈ నెల 28న నెట్ఫ్లిక్స్లోకి విష్ణు విశాల్ నటించిన ‘ఆర్యన్’ మూవీ
⭒ కమల్ నిర్మాణంలో రజినీ నటించబోయే సినిమాను ‘మహారాజ’ ఫేమ్ నిథిలన్ లేదా ‘పార్కింగ్’ ఫేమ్ రామ్ కుమార్ డైరెక్ట్ చేయనున్నట్లు టాక్
⭒ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు తొలుత ‘మాస్టర్ పీస్’ అనే టైటిల్ అనుకున్నాం: డైరెక్టర్ మహేశ్
News November 23, 2025
త్వరలో జిల్లా అంతటా పర్యటిస్తా: జీవన్ రెడ్డి

త్వరలో నిజామాబాద్ జిల్లా అంతటా పర్యటించి,స్థానిక పోరుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తానని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆపద కాలంలో పార్టీ కోసం పోరాడుతున్న గులాబీ శ్రేణులకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను గ్రామగ్రామాన ఎండగడతామని అన్నారు.


