News April 29, 2024

నిన్న TDP.. నేడు YCP

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు వైస్ ఎంపీపీ చప్పిడి రవణమ్మ తిరిగి వైసీపీ గూటికి చేరారు. నిన్న బ్రాహ్మణపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రాంనారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. 24 గంటలు గడవక ముందే ఆ పార్టీని వీడారు. ఇవాళ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ సమక్షంలో తిరిగి వైసీపీలో చేరడం విశేషం.

Similar News

News October 30, 2025

నెల్లూరు జిల్లా ట్రెజరీ అధికారిగా శ్రీనివాసులు

image

నెల్లూరు జిల్లా ట్రెజరీ అధికారిగా శ్రీనివాసులు గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో ఖజానా విభాగం కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ఖజానా సిబ్బంది అందరి సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేస్తానన్నారు. సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

News October 30, 2025

నెల్లూరు: ఒక్కో హెక్టార్‌కు రూ.25వేల పరిహారం

image

తుపాను ధాటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 42 హెక్టార్లలో ఉద్యానపంటలకు నష్టం వాటిల్లిందని ఆ శాఖ జిల్లా అధికారి సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాలు రూపొందించినట్లు చెప్పారు. దెబ్బతిన్న కూరగాయలు, బొప్పాయి పంటలకు హెక్టారుకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో పరిశీలించి ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.

News October 30, 2025

నెల్లూరు: హాస్టల్ విద్యార్థులకు బెడ్ షీట్లు

image

నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు బెడ్ షీట్లు వచ్చాయి. 3,585 కార్పెట్లు, 3,854 బెడ్ షీట్స్ సరఫరా చేసినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ& సాధికారత అధికారిణి పి.వెంకటలక్ష్మమ్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 43 బీసీ హాస్టళ్లకు వీటిని పంపిణీ చేసినట్లు చెప్పారు.