News February 17, 2025
నిపుణులతో విద్యార్థులకు కంటి పరీక్షలు: DMHO

నిపుణులతో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా.మధుసూదన్ తెలిపారు. BHPL జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఫిబ్రవరి 17 నుంచి 25 వరకు 8 రోజులపాటు కొనసాగనున్నట్లు తెలిపారు. ఆర్.బి.ఎస్.కె, టీం ద్వారా ఫేస్ 1, ఫేస్ 2లో 5 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు కళ్లు స్క్రీనింగ్ చేసి కంటి సమస్యలు గుర్తించనున్నట్లు తెలిపారు.
Similar News
News March 23, 2025
IPL చరిత్రలో ఆర్చర్ చెత్త రికార్డ్

IPL-2025లో RR బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఇవాళ ఉప్పల్‌లో SRHతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 76 పరుగులు ఇచ్చారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఓ స్పెల్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మారారు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో తీక్షణ(52), సందీప్ శర్మ(51) ధారాళంగా పరుగులు ఇచ్చారు. అలాగే ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు(46) నమోదైన మ్యాచ్‌గానూ రికార్డ్ సృష్టించింది.
News March 23, 2025
హెచ్చరిక: అలా చేస్తే ఇక లైసెన్స్ రద్దు?

TG: తరచూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులకు షాక్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వాటిని మళ్లీ పునరుద్ధరించకపోవడమే కాక వారి వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా చేయబోమని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ నిబంధనను అమలుచేయనున్నట్లు తెలుస్తోంది.
News March 23, 2025
కృష్ణ భారతి కాళ్లకు నమస్కరించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పట్టణంలోని అల్లూరి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన సందర్భంలో పసల కృష్ణమూర్తి కుమార్తె పసల కృష్ణ భారతి కాళ్లకు నమస్కరించారు. ఆ సందర్భంలో కృష్ణ భారతి మోదీ తల్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అప్పుడే పసల కృష్ణ భారతి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన కృష్ణభారతి ఆదివారం మృతి చెందడంతో పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.