News March 12, 2025
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చెరువులను ధ్వంసం చేయాలి

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 438 ఆక్వా చేపల చెరువులను త్వరితగతిన ధ్వంసం చేయాలని అధికారులకు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలు జరీ చేశారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 84 చెరువులను ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 8, 2025
వేములవాడ: ఎంపీడీవో కార్యాలయం ఆకస్మిక తనిఖీ

వేములవాడ అర్బన్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ తనిఖీ చేశారు. కేంద్రంలో కల్పించిన సౌకర్యాలు, ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.
News December 8, 2025
వేములవాడ: ‘ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి’

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఇన్ఛార్జ్ కలెక్టర్, ఎన్నికల అధికారి గరీమా అగర్వాల్ సోమవారం పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో కల్పించిన వసతులపై ఆరా తీసి అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్, కౌంటింగ్కు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
News December 8, 2025
వేములవాడ: కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఇన్ఛార్జ్ కలెక్టర్

వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ధాన్యం నిల్వలు పరిశీలించి, సేకరణ, తరలింపు గురించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్యాబ్ ఎంట్రీ, తదితర అంశాలపై ఆరా తీశారు. పరిశీలనలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయి, తహశీల్దార్ విజయ ప్రకాష్ రావు పాల్గొన్నారు.


