News March 20, 2025
నిబంధనలు పాటించని లారీలు సీజ్: కలెక్టర్

నిబంధనలు పాటించని రాయిలోడుతో వెళ్లే వాహనాలను సీజ్ చేస్తామని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ లో అధికారులు, క్వారీ లారీల యజమానులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల క్వారీ లారీల కారణంగా ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. వీటి వల్ల రైల్వే ట్రాక్ దెబ్బతిన్నలతో రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడిందన్నారు.
Similar News
News December 9, 2025
BREAKING: తూ.గో జిల్లాలో స్కూల్ పిల్లల బస్సు బోల్తా

తూ.గో జిల్లాలో తెల్లవారుజామున పెనుప్రమాదం తప్పింది. పెరవలిలోని తీపర్రు వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉండగా వారు సురక్షితంగా బయటపడ్డారు. బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడం వలనే ప్రమాదం జరిగినట్లు సమాచారం.
News December 9, 2025
వనపర్తి: గెలుపు కోసం సర్పంచ్ అభ్యర్థుల నానాతంటాలు

జిల్లాలో ఈ నెల 11న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు మటన్, మద్యం పంపిణీకి భారీగా ఖర్చు చేస్తున్నారు. హోటళ్ల వద్ద టీ, టిఫిన్లకు కూడా భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు, నాయకులు శ్రమిస్తున్నారు.
News December 9, 2025
పెద్దపల్లి: ముగింపు దశకు మొదటి విడత ప్రచార పర్వం

పెద్దపల్లి జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంథని, కమాన్పూర్, రామగిరి, శ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లో 99 సర్పంచ్, 896 వార్డు మెంబర్ల ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తోంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓట్ల కోసం నాయకులు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. పలుచోట్ల అభ్యర్థులు సోషల్ మీడియా బృందాలను ఏర్పాటు చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.


