News February 18, 2025

నిబంధనలు పాటిస్తేనే అనుమతులు జారీ: బల్దియా కమిషనర్

image

భవన నిర్మాణ నిబంధనలు పాటిస్తేనే అనుమతులు జారీ చేస్తామని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే స్పష్టం చేశారు. నూతన భవనాల నిర్మాణాలకు అనుమతుల మంజూరు బడా భవన నిర్మాణాలకు ఆక్యుపెన్సీని సర్టిఫికెట్ల జారీకి కమిషనర్ నగర పరిధిలోని సుబేదారి ప్రాంతంలోని పోస్టల్ కాలనీ ప్రకాశ్ రెడ్డి పేట ప్రాంతంలో గల లోటస్ కాలనీ ఖాజీపేట ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నమోదు చేసిన వివరాలను కొలతలు వేసి పరిశీలించారు.

Similar News

News March 24, 2025

వరంగల్: నగర అభివృద్ధికి సహకరించండి: కమిషనర్

image

పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని GWMC కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరపు పన్నులు చెల్లించడానికి 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, దీర్ఘకాలంగా పన్నులు చెల్లించని వారికి ఇప్పటికే రెడ్ నోటీసులు అందించి ఆస్తులను జప్తు చేస్తున్నామని హెచ్చరించారు.

News March 24, 2025

హసన్‌పర్తిలో యాక్సిడెంట్.. మృతులు సీతంపేట వాసులు!

image

HNK జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో చెరువు మూలమలుపు వద్ద టిప్పర్ లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనలో దుర్గం పవన్ కళ్యాణ్ (22), బౌతు మహేష్ (24) అనే <<15861672>>ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి<<>> చెందారు. సీతంపేట గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 24, 2025

WGL: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

image

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్‌లో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడుతుందా..? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? స్టే.ఘనపూర్‌లో ఉప ఎన్నికలు జరుగుతాయేమోనని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

error: Content is protected !!