News December 1, 2024
నిబంధనల ప్రకారం క్లెయిమ్‌లు పరిష్కరించాలి: కన్నబాబు

ప్రత్యేక ఓటర్ జాబితా సవరణలో భాగంగా చేపట్టిన క్లెయిమ్‌లు పరిష్కారం పక్కాగా జరగాలని ఎన్నికల పరిశీలకులు కన్నబాబు పేర్కొన్నారు. శనివారం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో ఓటరు జాబితా సవరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఓట్ల తొలగింపులకు అందిన క్లెయిమ్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.
Similar News
News February 8, 2026
నేడు అనంతలో చికెన్, మటన్ ధరలు ఇలా

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.200, స్కిన్ లెస్ రూ.220, అనంతపురంలో రూ.200, స్కిన్ లెస్ రూ.210 గుంతకల్లులో రూ.200, స్కిన్లెస్ రూ.210 విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. ఒక్కసారి ఇక చికెన్ ధరలు తగ్గడంతో మాంసం ప్రియులు హర్షం వ్యక్తం చేశారు.
News February 8, 2026
ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో నిర్వహించనున్న ఏపీపీఎస్సీ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీపీఎస్సీ ఛైర్మన్ శశిధర్ తెలిపారు. శనివారం అనంతపురం కలెక్టరేట్ ట్రెజరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు 4 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.
News February 7, 2026
పంచాయతీ ఎన్నికలు.. కమిషన్ సన్నద్ధం

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం జిల్లాలోని 577 గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాను మార్చి 9వ తేదీ నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ నెలలో సర్పంచుల పదవీకాలం ముగియనుండటంతో, గడువు ముగియగానే ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు అధికార యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది.


