News October 29, 2024

నిబంధనల మేరకే టపాసులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి: SP

image

దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసులు దుకాణాలు నిర్వహించేవారు లైసెన్స్ ఉన్నవారు మాత్రమే నిబంధన మేరకే షాపులు ఏర్పాటు చేసుకోవాలని జగిత్యాల జిల్లా SP అశోక్ కుమార్ తెలిపారు. SP మాట్లాడుతూ.. ఎలాంటి అగ్ని ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా దుకాణాలు ఏర్పాటు చేసే ప్రదేశంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జనవాసాలు లేని బహిరంగ ప్రదేశాలలో మాత్రమే టపాకాయల షాపుల ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

Similar News

News November 24, 2024

వేములవాడ: రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సెలవు కార్తీక మాసం పురస్కరించుకొని భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలతో పాటు అనుబంధ ఆలయాల్లో సైతం భక్తులు ఉదయం నుంచే కోనేటిలో పుణ్యస్నానం ఆచరించి క్యూ ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అనంతరం భక్తులు కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

News November 24, 2024

దీక్షా దివాస్‌ ఉమ్మడి KNR జిల్లాల ఇన్‌ఛార్జులు వీరే

image

TG రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని BRS శ్రేణులకు మాజీ మంత్రి, సిరిసిల్ల MLA కేటీఆర్ పిలుపునిచ్చారు. నవంబర్ 29న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. దీక్షా దివాస్‌కు ఉమ్మడి జిల్లాలో
KNR-ప్రకాశ్ ముదిరాజ్ MLC,
SRCL-బోయినపల్లి వినోద్,
PDPL-కొప్పుల ఈశ్వర్,
JGTL-సలీం(MLC)ను ఇన్‌ఛార్జులుగా నియమించారు.

News November 24, 2024

వివరాలు ఫోన్ ద్వారా సేకరించాలి: ఉప ముఖ్యమంత్రి భట్టి

image

డోర్ లాక్, వలస వెళ్లిన వారి వివరాలు ఫోన్ ద్వారా సేకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం కలెక్టర్‌తో మాట్లాడారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరికి దశకు చేరుకుందని, సర్వే డాటా ఎంట్రీ చాలా కీలకమైనదని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని ఆయన స్పష్టం చేశారు.