News October 29, 2024
నిబంధనల మేరకే టపాసులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి: SP
దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసులు దుకాణాలు నిర్వహించేవారు లైసెన్స్ ఉన్నవారు మాత్రమే నిబంధన మేరకే షాపులు ఏర్పాటు చేసుకోవాలని జగిత్యాల జిల్లా SP అశోక్ కుమార్ తెలిపారు. SP మాట్లాడుతూ.. ఎలాంటి అగ్ని ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా దుకాణాలు ఏర్పాటు చేసే ప్రదేశంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జనవాసాలు లేని బహిరంగ ప్రదేశాలలో మాత్రమే టపాకాయల షాపుల ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.
Similar News
News November 14, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బాలల దినోత్సవం. @ గన్నేరువరం మండలంలో ట్రాక్టర్ రోటవేటర్ లో ఇరుక్కుని వ్యక్తి మృతి. @ మానకొండూరు మండలంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడి మృతి. @ భీమారం మండలంలో నృత్యం చేస్తుండగా కుప్పకూలి మృతి చెందిన యువకుడు. @ ముగ్గురు సైబర్ క్రిమినల్స్ ను అరెస్ట్ చేసిన మెట్పల్లి పోలీసులు. @ జగిత్యాలలో దిశా సమావేశంలో పాల్గొన్న ఎంపీ అరవింద్.
News November 14, 2024
కరీంనగర్: గ్రూప్-3 ప్రశ్న పత్రాలకు కట్టుదిట్టమైన బందోబస్తు
గ్రూప్-3 పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఇతర మెటీరియల్‌ను కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచినట్లు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. కరీంనగర్లోని స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తామన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు.
News November 14, 2024
KNR: పిల్లలు దైవానికి ప్రతిరూపాలు: కలెక్టర్
పిల్లలు దైవానికి ప్రతిరూపమని, వారిని సన్మార్గంలో నడిపిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలల దినోత్సవం వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 80 శాతం పిల్లల భవిత ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని అన్నారు.