News April 15, 2025

నిబద్ధతతో పని చేయాలి: MHBD ఎస్పీ

image

పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే నిబద్ధతతో పని చేయాలని MHBD ఎస్పీ రామ్నాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్‌లో కోర్టు డ్యూటీ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. కోర్టు డ్యూటీలో నిర్లక్ష్యం వహించకూడదని, కేసు ఛార్జి షీట్లను నిర్దేశిత కాలంలో న్యాయస్థానాలకు సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News November 28, 2025

పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే..

image

ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలతో పాటు పెద్దల్లో కూడా అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఇలా కాకుండా పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే పిల్లలు చదువుకొనేటపుడు పేరెంట్స్ ఫోన్ పట్టుకొని కూర్చోకుండా వారితో కూర్చొని వార్తలు, పుస్తకాలు చదవాలి. దీంతో పిల్లలకు అది అలవాటవుతుంది. ఎప్పటికప్పుడు అటెన్షన్ బ్రేక్‌లు ఇవ్వాలి. టైం టేబుల్ తయారు చేయాలి. మెమరీ గేమ్‌లు ఆడించాలి. వారి దృష్టి మరల్చే వస్తువులు దూరంగా ఉంచాలి.

News November 28, 2025

గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి) ఎలా గుర్తించాలి?

image

ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.

News November 28, 2025

గొర్రెల్లో బొబ్బ రోగం.. ఎలాంటి చికిత్స అందించాలి?

image

☛ వ్యాధి సోకిన గొర్రెలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి.
☛ ఆ గొర్రెలకు గంజి వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. పచ్చి పశుగ్రాసాన్ని ఎక్కువగా ఇవ్వరాదు.
☛ బొబ్బల మీద వేపనూనె లేదా హిమాక్స్ వంటి పూత మందులను రాయాలి.
☛ వెటర్నరీ డాక్టర్ సలహాతో బాక్టీరియాను నియంత్రించడానికి యాంటీ బయాటిక్స్, డీహైడ్రేషన్ తగ్గించడానికి IV fluids లేదా ORS తరహా ద్రావణాలు ఇవ్వడం, టీకాలు అందించడం మంచిది.