News September 8, 2024
నిమజ్జనాల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
వినాయక చవితి సందర్భంగా మంగినపూడి బీచ్, కాలేఖాన్ పేట మంచినీళ్ళ కాలువ వద్ద నిమజ్జనాల ఏర్పాట్లను ఎస్పీ ఆర్.గంగాధర రావు స్వయంగా పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతిమలను నిమజ్జనం చేసే ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. భక్తులు నీటిలో ఎక్కువ దూరం వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News October 11, 2024
ప్రభుత్వ జోక్యంతో ధరలు అదుపులోకి వచ్చాయి: మంత్రి కొల్లు
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లి, టమాటో అందిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ట్వీట్ చేశారు. అన్ని రైతుబజార్లలో సబ్సిడీపై కిలో టమాటో రూ.40, కిలో ఉల్లి రూ.35కి అందజేస్తున్నామని కొల్లు తెలిపారు. అధిక ధరలకు ప్రభుత్వం కూరగాయలు అమ్ముతోందన్న ప్రచారం అవాస్తవమని, ప్రభుత్వ జోక్యంతో ఉల్లి, టమాటో ధరలు అదుపులోకి వచ్చాయని కొల్లు ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
News October 11, 2024
హైదరాబాద్-విజయవాడ హైవేపై బారులు తీరిన వాహనాలు
దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీ వచ్చే వాహనాలు జాతీయ రహదారిపై బారులు తీరాయి. దీంతో జాతీయ రహదారిపై టోల్ గేట్‌ల వద్ద అదనపు బూత్‌లు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. వాహనాల రద్దీ పెరగడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని జగ్గయ్యపేట నుంచి గన్నవరం వరకు విస్తరించి ఉన్న జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది.
News October 11, 2024
కైకలూరులో రికార్డ్ స్థాయిలో ధరలు.. KG రూ.400
కైకలూరులో రికార్డు స్థాయిలో వెల్లుల్లి ధర పలుకుతోంది. అటు NTR జిల్లాలో కూడా భారీగా పెరిగాయి. ఇప్పటికే ఉల్లి, టమాటాలు సెంచరీకి దగ్గరలో ఉండగా.. వాటికి వెల్లుల్లి తోడయింది. ప్రస్తుతం వెల్లుల్లి కిలో రూ.400 పలుకుతోందని వినియోగదారులు, వ్యాపారస్థులు చెబుతున్నారు. ఇప్పటికే పలు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తక్కువ ధరలకు ఇచ్చే ఏర్పాట్లు చేయగా.. వాటిలో వెల్లుల్లిని చేర్చాలంటున్నారు.