News March 26, 2025
నిమ్మగడ్డి పంట సాగుకు పార్వతీపురం జిల్లా అనుకూలం: కలెక్టర్

మన్యం జిల్లాలో రెండు వేల ఎకరాల్లో నిమ్మగడ్డి పంట సాగు చేసేందుకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు. రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగింది. తొలి రోజు జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ.. నిమ్మగడ్డి పంట సాగుకు జిల్లా అనుకూలంగా ఉంటుందన్నారు.
Similar News
News December 23, 2025
మహిళా క్రికెటర్ల ఫీజులు భారీగా పెంపు

భారత మహిళా క్రికెటర్ల ఫీజులను BCCI భారీగా పెంచింది. ఇకపై వన్డేలతో పాటు మల్టీ డే మ్యాచులకు ఓ రోజుకు(ప్లేయింగ్ 11) రూ.50 వేలు చెల్లించనున్నారు. స్క్వాడ్‌లోని సభ్యులకు రూ.25 వేలు, రిజర్వ్ ప్లేయర్లకు రూ.12,500 అందించనున్నారు. అదే T20 అయితే రూ.25వేలు చెల్లించనున్నారు. రిజర్వ్‌లో ఉన్నవారికి రూ.12,500 దక్కనుంది. ప్రస్తుతం వీరికి ప్లేయింగ్ 11లో రూ.20 వేలు, బెంచ్ మీద ఉంటే రూ.10వేలు చెల్లిస్తున్నారు.
News December 23, 2025
డిసెంబర్ 23: చరిత్రలో ఈ రోజు

☛ 1902: భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ జననం
☛ 1940: ప్రముఖ నవలా రచయిత ముదిగొండ శివప్రసాద్ జననం
☛ 1997: పండితుడు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి మరణం
☛ 2004: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణం(ఫొటోలో)
☛ 2014: ప్రముఖ దర్శకుడు బాలచందర్ మరణం
☛ 2022: ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మరణం
– జాతీయ రైతు దినోత్సవం
News December 23, 2025
పాలమూరు: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరం 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సమన్వయకర్త బి.నాగమణి మాల తెలిపారు. జనవరి 21 వరకు ఆన్‌లైన్‌లో రూ.100 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.


