News January 26, 2025

నిమ్మనపల్లిలో విషాదం.. రెండేళ్ల చిన్నారి మృతి

image

ముక్కుపచ్చలారని చిన్నారిపైకి మృత్యువు ట్రాక్టర్ రూపంలో వచ్చింది. నిమ్మనపల్లి ఎస్ఐ తిప్పేస్వామి కథనం మేరకు.. కొండయ్యగారిపాల్లెకు చెందిన ఉప్పుతోళ్ల సురేశ్, పవిత్రల కుమార్తె గానవి(2) ఆదివార ఇంటి ముందు ఆడుకుంటుంది. ఈక్రమంలో అదే ప్రాంతానికి చెందిన రెడ్డిబాషాఖాన్ ట్రాక్టర్‌ను వేగంగా నడిపి చిన్నారిపైకి దూసుకెళ్లాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News July 6, 2025

ధర్మపురి : ‘ప్రమాదకర గదులను వెంటనే కూల్చండి’

image

ప్రమాదకర గదులు వెంటనే కూల్చాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధర్మపురి మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన ఆయన.. ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. గదుల స్థితి దారుణంగా ఉండటాన్ని గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సానిటేషన్ పనులపై సమీక్షించి, డ్రైనేజీలు, కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

News July 6, 2025

జగిత్యాల :రేపటితో ముగియనున్న పీరీల పండుగ

image

జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో 11 రోజుల పాటు పెద్దపులి వేషధారణలతో జరుపుకున్న పీరీల పండుగ రేపటితో ముగియనుంది. నిన్న చిన్న సర్గత్తి పురస్కరించుకొని భక్తులు మట్కిలు తీసి మొక్కులు సమర్పించుకున్నారు. రేపు పెద్ద సర్గత్తి కావడంతో వేడుకలు అంబరాన్నంటనున్నాయి. రేపు తొలి ఏకాదశి కావడంతో పలు మండలాల్లో సోమవారం మొహర్రం పండుగ నిర్వహించనున్నారు.

News July 6, 2025

తెలుగు విశ్వవిద్యాలయం.. పరీక్షల తేదీలు ఖరారు

image

తెలుగు విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పరీక్ష షెడ్యూల్ నేడు విడుదల చేశారు. BFA, బి.డిజైన్, (సెమిస్టర్-2,4,6); PG డిప్లొమా ఇన్ యోగ, MA, MFA, MCA, MAJ &MC, ఎం.డిజైన్ (సెమిస్టర్-2) కోర్సులకు మొదటి, 2వ సెమిస్టర్ (రెగ్యులర్/ బ్యాక్ లాగ్/ఇంప్రూవ్మెంట్) పరీక్షలు జులై/ఆగస్టులో నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు ఈనెల 19న చివరి తేదీ. రూ.100 ఫైన్‌తో 23 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.