News January 27, 2025
నిమ్మనపల్లె: చిన్నారి మృతి.. ట్రాక్టర్ డ్రైవర్ అరెస్టు

చిన్నారి మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ను అరెస్టు చేసినట్లు నిమ్మనపల్లె ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ ఢీకొని కొండయ్యగారిపల్లికి చెందిన సురేశ్, పవిత్రల కుమార్తె గానవి(2) మృతి చెందిన సంగతి తెలిసిందే. చిన్నారి మృతి ఘటనతో డ్రైవర్ రెడ్డి బాషా ఖాన్పై రాత్రి కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం సోమవారం సాయంత్రం నిమ్మనపల్లె వద్ద డ్రైవర్ను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News November 12, 2025
సిరిసిల్ల: ‘రైతు బజార్లోనే విక్రయాలు జరగాలి’

సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్లో చికెన్, మటన్, చేపలు, కూరగాయల విక్రయాలు పూర్తి స్థాయిలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూరగాయల షెడ్ను బుధవారం పరిశీలించారు. స్లాటర్ హౌస్ నిర్మించి, చికెన్, మటన్, చేపలు విక్రయాల పూర్తి స్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరిశీలనలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, పాల్గొన్నారు.
News November 12, 2025
SRCL: ‘కొత్తచెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలి’

సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువును ఇన్చార్జి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. చెరువు కట్టపైకి వెళ్లి, పరిసరాలు సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువు పరిసరాలు మొత్తం శుభ్రం చేయాలని, చెత్తాచెదారం, చెట్లు తొలగించాలని సూచించారు.
News November 12, 2025
సికింద్రాబాద్లోని NIEPMDలో ఉద్యోగాలు

సికింద్రాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (<


