News April 5, 2025
నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

HYD నిమ్స్ ఆసుపత్రిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. మిలీనియం బ్లాక్‌లో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియాక్ ఐసీయూలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ మాలెంపాటి అమరేశ్ రావు నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. తల్లిదండ్రుల ఆధార్, రేషన్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో ఉ.10 నుంచి సా.4 వరకు పాత భవనం మొదటి అంతస్తు ఆరో వార్డులో సంప్రదించాలి.
Similar News
News April 9, 2025
దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబ్ బ్లాస్ట్‌కు వేరే దగ్గర ప్లాన్

దిల్సుఖ్నగర్ <<16034773>>బాంబ్ బ్లాస్ట్<<>> ఘటనలో నిందితులకు నిన్న హై కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే ఉగ్రవాదులు ముందుగా స్థానికంగా మిర్చి సెంటర్, మద్యం దుకాణాన్ని టార్గెట్ చేయగా సమయం మించిపోతుండడంతో వఖాస్ బాంబుతో సైకిల్ని 107 బస్టాప్ వద్ద వదిలేసి వెళ్లాడు. దీనికి ముందు లుంబినీ పార్క్ వద్ద పేలిన బాంబ్‌ను కూడా హుస్సేన్‌సాగర్‌లో పెట్టాలని ప్లాన్ చేశారు. సమయం మించిపోవడంతో లేజేరియం వద్ద వదిలేసి వెళ్లాడు.
News April 9, 2025
మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం

మొయినాబాద్‌లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏడుగురు యువతులు, 14 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాలిడే ఫామ్ హౌస్‌లో తెల్లవారుజామున SOT పోలీసులు దాడులు నిర్వహించి మద్యం బాటిళ్లతో పాటు 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్, ముంబైతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి అర్ధనగ్నంగా డాన్సులు చేయించిన్నట్లు సమాచారం.
News April 9, 2025
HYD: రాజాసింగ్‌పై 3 సెక్షన్ల కింద కేసులు

గోషామహల్ MLA రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ PSలో 3 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ ప్రసంగిస్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతుండగా ‘భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝళిపిస్తే లాఠీలకు పనిచెప్పాల్సి వస్తుంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేశారు.