News October 28, 2024

నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలి: స్పీకర్ అయ్యన్న

image

అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో ఇన్ ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం జరిగింది. స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయిని అరికట్టాలన్నారు. నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు. ఆన్ రాక్ అల్యూమినియం ఫ్యాక్టరీ ఒప్పందాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాక్టరీకి చెందిన భారీ వాహనాలు రాకపోకలను నియంత్రించాలన్నారు.

Similar News

News November 2, 2024

పరవాడ: రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టిన సీఎం

image

పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామంలో రహదారుల మరమ్మతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. సిమెంటు పిక్కతో కలిపిన కాంక్రీట్ మిక్చర్‌ను స్వయంగా పారతో తీసి గుంతల్లో వేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News November 2, 2024

ఎవరినైనా ఇబ్బంది పెట్టామా: సీఎం చంద్రబాబు

image

విజయనగరం జిల్లాలో ఎన్నికల కోడ్ రావడంతో ప్రోగ్రాం పరవాడకు మార్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాత్రి రాత్రికి ప్రోగ్రాం మార్చినా ఎక్కడైనా పరదాలు కట్టామా, చెట్లు కొట్టామా, ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి అరెస్ట్ చేయించామా అన్నారు. రోడ్లు బాగోలేక RTC బస్సులను నిలిపివేశారని పేర్కొన్నారు. గుంతలతో ప్రయాణీకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, మంచి రోజులు వచ్చాయని ఈ గ్రామం నుంచే మంచి రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటామన్నారు.

News November 2, 2024

సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు: సీఎం చంద్రబాబు

image

వెన్నెలపాలెంలోని సభలో CM చంద్రబాబు రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై మాట్లాడారు. పరవాడ జంక్షన్ స్ఫూర్తిగా సంక్రాతి నాటికి రాష్ట్రాన్ని గుంతలు లేని రోడ్లుగా మార్చాలని R&B మంత్రికి సూచించారు. YCP ఐదేళ్లలో రహదారులను పట్టించుకోకపోవడంతో ఎక్కడికక్కడ గుంతలు పడ్డాయన్నారు. ఈ రోడ్లు చూశాక గర్భిణీలకు ఆస్పత్రికి వెళ్లే పనిలేకుండా రోడ్లపైనే డెలివరీ అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.