News February 17, 2026
నియోజకవర్గ సమస్యలపై సీఎం రివ్యూ

అల్లూరి, పోలవరం, మన్యం జిల్లాల సమస్యలపై అమరావతిలో సీఎం చంద్రబాబు మంగళవారం రివ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు అల్లూరి, పోలవరం కలెక్టర్ దినేశ్ కుమార్, ఎస్పీ అమిత్ బర్ధర్‌తో పాటు మన్యం జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఉన్నారు. రివ్యూలో రంపచోడవరం నియోజకవర్గంలోని ప్రతి సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే శిరీష దేవి తెలిపారు.
Similar News
News March 17, 2026
ప్రభుత్వ పథకాల అమలుపై మంత్రి సవిత సమీక్ష

పెనుకొండలోని ఆర్&బీ అతిథి గృహంలో మంత్రి సవిత మండల స్థాయి అధికారులతో ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. హౌసింగ్ పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతీ లబ్ధిదారుకు ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని, 2014-19 కాలంలో ఇల్లు నిర్మించి బిల్లులు పొందని లబ్ధిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
News March 17, 2026
HYD: ఫ్లోర్ కడిగినందుకు రూ.5వేల FINE

HYDలో తాగునీటి దుర్వినియోగంపై HMWSSB కఠినచర్యలు చేపట్టింది. జూబ్లీహిల్స్ వాసి తాగునీటితో ఫ్లోర్లు కడుగుతుండగా గుర్తించి రూ.5వేల జరిమానా విధించారు. ప్రజల నుంచి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాగునీటిని వృథా చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.