News July 19, 2024

నిరుద్యోగులకు ప్రభుత్వం GOOD NEWS

image

TG: త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ‘ఓవర్ ల్యాపింగ్ లేకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం త్వరలో ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇందులో ఉ.10 నుంచి సా.5 వరకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇస్తాం. ఇప్పటికే నిపుణులను ఎంపిక చేశాం’ అని భట్టి వివరించారు.

Similar News

News January 10, 2026

అమరావతిపై YCP వైఖరి పూర్తిగా మారినట్లేనా?

image

AP: అమరావతిపై <<18817916>>సజ్జల<<>> వ్యాఖ్యలతో రాజధానిపై ఆ పార్టీ వైఖరి పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్ <<18799615>>కామెంట్ల<<>> తర్వాత YCP అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారనే టాక్ విన్పించింది. 3 రాజధానుల అంశం గత ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు పలుమార్లు ఆ పార్టీ నేతలు అన్నారు. ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అందుకే జగన్ వ్యాఖ్యలపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై మీరేమంటారు.

News January 10, 2026

క్యాల్షియం ఎక్కువగా ఎందులో దొరుకుతుందంటే?

image

కాల్షియం అనేది ఎముకల ఆరోగ్యాన్ని, బలాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్, డైరీ ప్రొడక్ట్స్ లో క్యాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. అలాగే ఆరెంజ్, ఆప్రికాట్, అంజీర పండ్లు, కివీ, స్ట్రాబెర్రీ, అరటిపండ్లలో క్యాల్షియం సమ‌ృద్ధిగా లభిస్తుంది. ఇవి ఎముకలు,దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన కాల్షియంను అందిస్తాయంటున్నారు నిపుణులు.

News January 10, 2026

ప్రయాణికుల కోసం ప్రత్యేక చర్యలు: కోమటిరెడ్డి

image

TG: సంక్రాంతికి ఊరెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ‘హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేశాం. పంతంగి టోల్ గేట్ వద్ద మాత్రమే కాస్త రద్దీ ఉంది. విజయవాడ హైవేపై ఆరు వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే నేషనల్ హైవే డైరెక్టర్‌తో మాట్లాడాం. అక్కడ యంత్రాలను కూడా తొలగించారు’ అని తెలిపారు.