News August 31, 2024
నిరుపయోగంగా మారిన సేంద్రియ ఎరువు తయారీ షెడ్లు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సేంద్రియ ఎరువు తయారీ ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించింది. ఒక్కొక్క షెడ్డుకు రూ.12 లక్షలు వెచ్చించారు. తడి, పొడి చెత్తను వేర్వేరు పద్ధతుల్లో ఎరువు తయారికి అనుగుణంగా వీటిని నిర్మించారు. అధికారుల, సిబ్బంది అలసత్వం కారణంగా నేటికీ అవి చాలా ప్రాంతాల్లో నిరుపయోగంగా మారాయి.
Similar News
News November 17, 2024
నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. సస్పెండ్
నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ చేసినందు వల్ల ముగ్గురు వైద్య విద్యార్థునులు, ఒక జూనియర్ డాక్టర్ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. 2వ సంవత్సరం విద్యార్థి ఒక నెల, ఇద్దరు 4వ సంవత్సరం విద్యార్థులను ఆరు నెలలు, ఒక జూనియర్ డాక్టర్ను మూడు నెలలు కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థినుల పట్ల ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ గుర్తించడంలో విఫలమైనట్లు సమాచారం.
News November 17, 2024
భువనగిరి: గ్రూప్-3 పరీక్ష.. యువతికి రోడ్డు ప్రమాదం
గ్రూప్ -3 పరీక్ష రాయడానికి వెళ్తున్న యువతికి గాయాలయ్యాయి. సంస్థాన్ నారాయణపురం చెందిన శృతి భువనగిరిలోని వెన్నెల కాలేజీలో పరీక్ష రాయడానికి వెళ్తుండగా అనాజీపురం వద్ద వారి బైక్పై ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో శృతికి గాయాలయ్యాయి. చికిత్స చేయించుకుని తిరిగి పరీక్ష కేంద్రానికి వెళ్లింది. కాగా సమయం ముగియడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వెను తిరిగింది.
News November 17, 2024
NLG: సాగు అంచనా @5,83,620 ఎకరాలు!
జిల్లాలో రైతన్నలు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 5,83,620 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. అందులో వరి 5,56,920 ఎకరాలు, సజ్జ 150, జొన్న 2,200, వేరుశనగ 21,000, పెసర 2,000, ఆముదం 350, మినుములు 1,000 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది.