News March 10, 2025

నిర్బంధాల కట్టడిని చిత్తడి చేసిన మిలియన్ మార్చ్: హరీశ్ రావు

image

ఆంక్షలు, నిర్బంధాల కట్టడిని చిత్తడి చేసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను మిలియన్ మార్చ్ నెరవేర్చిందని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ‘X’ లో పేర్కొన్నారు. మిలియన్ మార్చ్ నిర్వహించి ఈరోజుకు 14 ఏళ్లు అవుతుండగా జల మార్గం ద్వారా ట్యాంక్ బండ్ చేరుకున్న ఫోటోను హరీశ్ రావు పోస్ట్ చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు చూపిన పోరాటానికి, తెగువకు సెల్యూట్ చెప్పారు.

Similar News

News January 25, 2026

ఇవాళ నాన్ వెజ్ తినకండి! ఎందుకంటే..

image

వారంలో కొన్ని రోజులు కొందరు దేవుళ్ల పేరిట నియమాలు పాటించి సండే ఏ రూల్ పెట్టుకోం. కానీ లోకానికి వెలుగునిచ్చే ఆదిత్యుడి రోజైన ఆదివారం మాంసం జోలికి పోకూడదట. సూర్యాష్టక శ్లోకం ‘స్త్రీ తైల మధు మాంసాని యే త్యజంతి రవేర్దినే| న వ్యాధి శోక దారిద్య్రం సూర్యలోక స గచ్ఛతి’ ప్రకారం.. ఆదివారం స్త్రీ సాంగత్యం, తల నూనె, మద్యం, మాంసం తాకలేదంటే దారిద్ర్య విముక్తి, సూర్యలోక ప్రాప్తి. ఈరోజు సూర్య జయంతి-రథ సప్తమి.

News January 25, 2026

పశువుల్లో పాల ఉత్పత్తిని మరింత పెంచే గడ్డి

image

పశువుల్లో పాల ఉత్పత్తి పెరిగేందుకు చాలా మంది పాడి రైతులు సూపర్ నేపియర్ పశుగ్రాసం వాడుతున్నారు. ఇప్పుడు దీన్ని మించి అధిక ప్రొటీన్ శాతం కలిగి, పాల దిగుబడిని మరింత పెంచే ‘4G బుల్లెట్ సూపర్ నేపియర్’ పశుగ్రాసం అందుబాటులోకి వచ్చింది. నేపియర్‌తో పోలిస్తే ఇది చాలా మృదువుగా, 10-13 అడుగుల ఎత్తు పెరిగి, ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తుంది. దీన్ని ఎలా సాగు చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News January 25, 2026

రంగారెడ్డి జిల్లాలో భారీగా పెరిగిన జనాభా

image

రంగారెడ్డి జిల్లా ఓటర్ల జాబితాలో ముందుంది. 2011 సెన్సస్ ప్రకారం 24,46,265 మంది ఉండగా.. 2024కి భారీగా పెరిగింది. 8 నియోజకవర్గాల పరిధిలో 18 ఏళ్లుపైబడిన వారు 35,23,219 మంది ఉన్నారు. 526 పంచాయితీల పరిధిలో 7,94,653 మంది ఓటర్లు ఉండగా.. చేవెళ్ల, మొయినాబాద్, కొత్తూరు, షాద్‌నగర్, శంకర్‌పల్లి, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల పరిధిలో 1,75,974 మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా.
నేడు జాతీయ ఓటరు దినోత్సవం