News March 30, 2024
నిర్భయంగా ఓటు వేయండి: SP

ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చిత్తూరు ఎస్పీ జాషువా కోరారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.
Similar News
News October 19, 2025
కుప్పం : దీపావళికి స్పెషల్ ట్రైన్స్

దీపావళి పండుగ సందర్భంగా 6 రోజులు పాటు కుప్పం మీదుగా రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్ నడపనుంది. రాత్రి 7.55 బెంగళూరు సిటీ నుంచి 9.55 గంకు కుప్పం చేరుకుని జోలార్ పేట్ వెళ్తుంది. తిరిగి అర్ధరాత్రి 11:50 గంలకు కుప్పం నుంచి బెంగళూరు వెళ్లనుంది. ఉదయం 9.40 కి బెంగళూరు సిటీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలు కుప్పం చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 12.15కుప్పం నుంచి బయలుదేరి 3 గంటలు బెంగళూరు సిటీ చేరుకుంటుంది.
News October 18, 2025
శాంతిపురం : రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్

శాంతిపురం (M) బడుగుమాకులపల్లి వద్ద బైకును కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కెనమాకులపల్లికి చెందిన వెంకటరామప్ప (55), సత్యప్ప (60) బైకుపై బడుగు మాకులపల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా పలమనేరు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట రామప్ప అక్కడికక్కడే మృతిచెందగా, సత్యప్ప తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రికి తరలించారు.
News October 18, 2025
చిత్తూరు: ఈ నెల 21న హాలిడే కోసం వినతి

ఈ నెల 20న దీపావళి పండుగ సందర్భంగా మరుసటి (మంగళవారం) పాఠశాలలకు సెలవు ప్రకటించాలని APTF నాయకులు విద్యాశాఖాధికారులకు విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ కార్యాలయంలో AD సుకుమార్‌ను కలిసిన APTF నాయకులు ఆరోజు పలువురు కేదారేశ్వర స్వామి వ్రతం నిర్వహించుకుంటారని, కావున సెలవు ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుుంటారో వేచి చూడాలి.