News March 30, 2024
నిర్భయంగా ఓటు వేయండి: SP

ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చిత్తూరు ఎస్పీ జాషువా కోరారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.
Similar News
News March 11, 2026
అమరావతికి వెళ్లిన చిత్తూరు కలెక్టర్

సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నేడు, రేపు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో భాగంగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం అమరావతికి వెళ్లారు. కలెక్టర్ తిరిగి వచ్చే వరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఈ నెల 13 నుంచి సుమిత్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.
News March 11, 2026
చిత్తూరు జిల్లాలో గ్యాస్ కష్టాలు..!

యుద్ధం నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోనూ గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. సిలిండర్ తీసుకున్న 25 రోజుల తర్వాతే మరో సిలిండర్ బుక్ చేసుకోవాలి. గ్యాస్ బుకింగ్ OTP ఉంటేనే సిలిండర్ సప్లై చేస్తున్నారు. అయితే బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల తర్వాతే సిలిండర్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కష్టాలు లేకపోయినా పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్తులో గ్యాస్ కష్టాలు తప్పేటట్లు లేదు.
News March 11, 2026
CTR: జాతరకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పెద్దపంజాణి మండలం కమ్మినాయనపల్లికి చెందిన భరత్(20), శ్రీధర్(22), గిరి బైకుపై పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతరకు వచ్చారు. తిరిగి మంగళవారం రాత్రి ఇంటికి బయల్దేరారు. మాదనపల్లె క్రాస్ వద్ద బైకు, బొలేరో ఢీకొన్నాయి. భరత్, శ్రీధర్ అక్కడికక్కడే మృతిచెందారు. గిరి తీవ్రంగా గాయపడ్డాడు.


