News February 25, 2025
నిర్భయంగా చికెన్ తినండి: అనకాపల్లి కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో బర్డ్ఫ్లూ గానీ, ఆ లక్షణాలు గల కోళ్లు గానీ లేవని పశుసంవర్ధక శాఖ వైద్యాధికారులు ధ్రువీకరించినట్లు కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు. అందువల్ల ప్రజలు చికెన్, కోడిగుడ్లను నిర్భయంగా తినొచ్చన్నారు. మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన చికెన్ మేళాలో పాల్గొన్న ఆమె పాల్గొని మాట్లాడారు. 100డిగ్రీల వేడిలో బ్యాక్టీరియా, వైరస్ బతికే అవకాశాలు లేవన్నారు.
Similar News
News December 7, 2025
VZM: కలెక్టర్ ఆఫీస్లో రేపు పీజీఆర్ఎస్

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో పాటు గత అర్జీల స్లిప్పులను తీసుకుని రావాలని సూచించారు. అర్జీ స్థితిగతుల కోసం మీకోసం కాల్ సెంటర్ 1100, అదేవిధంగా Meekosam.ap.gov.in వెబ్సైట్ను వినియోగించుకోవచ్చు అన్నారు.
News December 7, 2025
ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం Jr.NTR చాలా సన్నగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కొత్త లుక్ వైరల్ అవుతోంది. గాగుల్స్ పెట్టుకుని సోఫాలో కూర్చున్న ఫొటో చూసి లుక్ బాగుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో బాడీ డబుల్ లేకుండా ఎన్టీఆరే స్టంట్స్ చేస్తారని సమాచారం.
News December 7, 2025
మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి. లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


