News April 10, 2024
నిర్భయంగా పోలీసులను సంప్రదించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

మహిళలు ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లాలో మహిళను వేధిస్తున్న పోకిరీలపై 5 కేసులు, 4 పెట్టి కేసులు నమోదు చేశామని చెప్పారు. లేడీస్ ఎవరైనా వేధింపులకు గురైనట్లయితే వెంటనే 87126564425, 100కి ఫిర్యాదు చేయాలని అన్నారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవడంతోపాటు ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
Similar News
News March 24, 2025
జగిత్యాల: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో జగిత్యాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ కుమార్‌పై అనర్హత వేటు పడుతుందా? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జగిత్యాలలో ఉప ఎన్నికలు జరుగుతాయేమోనని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
News March 23, 2025
గాయపడ్డ కానిస్టేబుల్‌ను పరామర్శించిన కేటీఆర్

కరీంనగర్‌లో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నగరంలో ర్యాలీలో నిర్వహించారు. ఈ ర్యాలీలో ఓ మహిళా కానిస్టేబుల్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయపడ్డ పద్మజాను కేటీఆర్ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ర్యాలీలో బైక్ వేగంగా రావడంతోనే గాయపడినట్టు మహిళా కానిస్టేబుల్ కేటీఆర్‌కు వివరించారు.
News March 23, 2025
కరీంనగర్: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్‌లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!