News February 9, 2025
నిర్మలా సీతారామన్‌ను కలిసిన Dy.CM భట్టి

దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. ఆయన వెంట ఎంపీలు మల్లు రవి, పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులున్నారు.
Similar News
News March 28, 2025
ప్రణాళికాబద్ధంగా ప్యాక్స్ పని చేయాలి: ఖమ్మం కలెక్టర్

ప్రణాళికాబద్ధంగా ప్యాక్స్ పని చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్యాక్స్‌లో ఉన్న సభ్యులు యాక్టివ్‌గా ఉండేలా చూడాలని చెప్పారు. అటు ప్యాక్స్ రైతులకు ఉపయోగపడే నూతన కార్యక్రమాలను చేపట్టేలా ప్రణాళిక చేయాలన్నారు.
News March 28, 2025
రైల్వేబోర్డు చైర్మన్‌ను కలిసిన ఖమ్మం ఎంపీ

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డోర్నకల్- మిర్యాలగూడ, డోర్నకల్- గద్వాల రైల్వే లైన్ అలైన్మెంట్ గురించి వివరించారు. పలు సమస్యలు, సూచనలు తెలపగా రైల్వే బోర్డు ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
News March 28, 2025
ఇల్లందు సింగరేణిలో పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్

ఇల్లందు సింగరేణి జేకే 5 ఓసీలో గురువారం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ జరిగింది. సినిమాలోని పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. చిత్ర యూనిట్ సభ్యులతో సింగరేణి ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది. సింగరేణి యాజమాన్యం షూటింగ్‌ను పర్యవేక్షించింది.