News February 14, 2026

నిర్మల్‌లో భార్యాభర్తల విజయం

image

నిర్మల్ మున్సిపల్‌లో 36వ వార్డు నుంచి అప్పల కావ్య, 38వ వార్డు నుంచి అప్పల గణేష్ చక్రవర్తి దంపతులు ఘన విజయం సాధించారు. నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్‌గా అప్పల కావ్యను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ కూచాడి శ్రీహరిరావు ఖరారు చేశారు.

Similar News

News March 11, 2026

WGL: యుద్ధం ఎఫెక్ట్.. ఇంటికి ఆలస్యంగా వంట గ్యాస్!

image

యుద్ద ప్రభావంతో వంట గ్యాస్ ఇంటికి చేరడం ఆలస్యం అవుతోంది. ఉమ్మడి వరంగల్‌లో అన్ని ఆయిల్ కంపెనీలకు చెందిన వంట గ్యాస్ కనెక్షన్లు సుమారుగా 11.14 లక్షలు ఉండగా, గ్యాస్ బుక్ చేసుకున్న వారికి గతంలో రెండు, మూడు రోజుల్లో ఇచ్చే గ్యాస్ ఇప్పుడు పది రోజులు పడుతోంది. గ్యాస్ ధరను ఒకేసారి రూ.60 పెంచి రూ.984 చేశారు. యుద్ధ భయంతో గ్యాస్ బుక్ చేసుకున్న 25 రోజులోనే మళ్లీ చేసుకుంటున్న వారికి బుక్ కావట్లేదని అంటున్నారు.

News March 11, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 11)

image

1689: ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మరణం
1915: భారత లెజెండరీ క్రికెటర్ విజయ్ హజారే జననం (ఫొటోలో)
1922: తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మాధవపెద్ది సత్యం జననం
1955: పెన్సిలిన్ సృష్టికర్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణం
1979: తెలుగు సాహితీకారుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ మరణం

News March 11, 2026

మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్..!

image

ప్రజాబలంలేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకుందామని, ఇందుకు కలిసి పని చేసేందుకు జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు మాతృ పార్టీ సీపీఐలో చేరాలని హైదరాబాద్ మగ్దూం భవన్లో జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల్లో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.