News April 4, 2025
నిర్మల్లో మహిళ సూసైడ్

ఆచూకీ తెలియని ఓ మహిళ నిర్మల్ పట్టణంలోని నటరాజ్ చెరువు వద్ద ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. గజ ఈతగాళ్లతో శవాన్ని బయటకు తీయించామని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 7, 2026
చిత్తూరు, తిరుపతి జిల్లాలో 600 ఉద్యోగాలు..!

SIPB సమావేశంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. తిరుపతిలో ఎథీరియల్ ఎక్స్ప్లోరేషన్ గిల్డ్ రూ.578 కోట్లు, నవ ఫుడ్ సెంటర్ రూ.44.42 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించేందుకు గ్రీన్ సిగ్నల్ దక్కింది. మరోవైపు చిత్తూరు జిల్లాలో పయనీర్ క్లీన్ అంప్స్ సంస్థ రూ.159 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయనుండగా.. దీనివల్ల సుమారు 600 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
News January 7, 2026
HYD: ఫతేమైదాన్ వద్ద ఈ గుట్ట గురించి తెలుసా?

నగరం అపూర్వ కట్టడాలు, సంపదకు నెలవు. ఇక్కడి కట్టడాలపై చరిత్రకారులు రాసిన పుస్తకాలు అనేకం. పెద్దగా ప్యాచుర్యంలేని ఫతేమైదాన్ సమీపంలో ‘నౌబత్ పహాడ్’ గురించి తెలుసా? ఈ పేరు వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ‘నౌబత్’ అంటే డోలు, ‘పహాడ్’ అంటే గుట్ట. ప్రజలకు ఫర్మానాలు వినిపించడానికి ఈ కొండపైనే నగారాలు మోగించేవారు. డోలు కొడుతూ ఆజ్ఞలను వినిపించేవారు. అలా ఈ ప్రాంతానికి నౌబత్ పహాడ్ అనే పేరు వచ్చింది.
News January 7, 2026
పిడికిలెత్తిన బిక్కనూర్.. తగ్గేదేలే..!

‘ఫార్మా హటావో – బిక్కనూర్ బచావో’ అంటూ నినదిస్తూ సాగిన భారీ ర్యాలీ కాసేపటి క్రితమే ప్రజాభిప్రాయ సేకరణ స్థలానికి చేరుకుంది. బిక్కనూర్ కమాన్, గాంధీ చౌక్ నుంచి బయలుదేరిన జనం, దారి పొడవునా నినాదాలతో హోరెత్తించారు. <<18785446>>కంపెనీ ప్రాంగణానికి<<>> చేరుకుని తమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేయనున్నారు. ‘మా ఊరు- మా ఊపిరి’ అంటూ గళం వినిపిస్తుండగా అన్ని పార్టీల నేతలు సపోర్ట్ చేశారు.


